షాద్ నగర్, వెలుగు: ఓ విద్యార్థిని స్కూల్మెట్ల పైనుంచి పడి మృతిచెందింది. షాద్‌నగర్‌కు చెందిన వర్ణిక(10) స్థానిక ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం స్కూల్ కు వెళ్లిన ఆమె మెట్లు దిగుతూ పడిపోయింది. స్పృహ కోల్పోవడంతో యాజమాన్యం హాస్పిటల్‌కు తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
