వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ప్రియాంక.. ఇప్పుడు రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది.
‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్‌ను సెలెక్ట్ చేశారని సమాచారం. రవితేజ, ప్రియాంక జోడీ ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ప్రియాంకకు తెలుగులో ఇది మరో కీలక అవకాశం కానుంది.
‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం సినిమాల్లో కనిపించింది. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన తర్వాత ఆమెకు తెలుగులో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో మూడు, కన్నడలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది.
ఇప్పుడు రవితేజ మూవీలో చాన్స్ అందుకోవడం టాలీవుడ్‌లో తన కెరీర్‌కు మరింత ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
