శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద లక్షల రూపాయల డబ్బు కలకలం రేపింది. దేవస్థానం టోల్ గేట్ దగ్గర పోలీస్ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ వాహనాల తనిఖీల్లో కొందరు వ్యక్తుల దగ్గర లక్షల కొద్దీ డబ్బు బయటపడింది. 30 లక్షల రూపాయల నగదు పట్టుబడటంతో అధికారులు విస్తుపోయారు. ఈ నగదును దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు.
ఒక వాహనంలో నోట్ల కట్టలతో కొందరు వ్యక్తులు శ్రీశైలం వచ్చారు. తమది బంగారం వ్యాపారమని, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చామని చెప్పారు. నగదు వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించడంతో సరైన వివరాలు చూపించాలని శ్రీశైలం పోలీసులు సదరు వ్యక్తులకు స్పష్టం చేశారు.
