పద్మ అవార్డ్స్ 2026: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారి లిస్ట్ !

పద్మ అవార్డ్స్ 2026: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారి లిస్ట్ !

దేశ రెండవ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందుగానే ఆదివారం (జనవరి 25) ప్రకటించిన లిస్టులో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తం 131 పద్మ అవార్డులలో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్,113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. 

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారి లిస్ట్:

  • గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌( ఏపీ) –  పద్మశ్రీ 
  • వెంపటి కుటుంబ శాస్త్రి ( ఏపీ) –  పద్మశ్రీ
  • విజయ్‌ ఆనంద్‌రెడ్డి (తెలంగాణ) –  పద్మశ్రీ
  • గడ్డమనుగు చంద్రమౌళి (తెలంగాణ) – పద్మశ్రీ
  • దీపికారెడ్డికి (తెలంగాణ) – పద్మశ్రీ
  •  కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌ – పద్మశ్రీ
  •  కళా విభాగంలో రాజేంద్ర ప్రసాద్‌ – పద్మశ్రీ 
  • కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ (తెలంగాణ) – పద్మశ్రీ
  • రామారెడ్డి మామిడి (పాడి, పశుసంవర్ధక విభాగం) (తెలంగాణ) – పద్మశ్రీ 
  • గూడూరు వెంకట్రావు  (తెలంగాణ) – పద్మశ్రీ
  • డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ (జన్యు సంబంధ పరిశోధనలు) (తెలంగాణ) – పద్మశ్రీ

ALSO READ | 2026 పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం: వివిధ రంగాల ప్రముఖులకు అత్యున్నత గౌరవం!