2026 పద్మ పురస్కారాల ప్రకటించిన కేంద్రం: వివిధ రంగాల ప్రముఖులకు అత్యున్నత గౌరవం!

2026 పద్మ పురస్కారాల ప్రకటించిన కేంద్రం: వివిధ రంగాల ప్రముఖులకు అత్యున్నత గౌరవం!

వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించడానికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ అవార్డులను  పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పేరుతో మూడు విభాగాలుగా ఇస్తారు. ఈ అవార్డులను ప్రతి ఏడాది కళ, సాహిత్యం, సైన్స్, వైద్యం, క్రీడలతో సహా వివిధ రంగాలలో విజయాలు సాధించిన వారికి ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారం, 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఈ సంవత్సరం గౌరవించబడిన వారిలో 75 ఏళ్ల అంకే గౌడ, రిటైర్డ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ, దశాబ్దాలుగా సేవలందించిన ఎంతో మంది ఇతర ప్రముఖులు ఉన్నారు.

2026 పద్మ అవార్డు గ్రహీతల లిస్ట్:

1. అంకె గౌడ
2. అర్మిదా ఫెర్నాండెజ్
3. భగవాన్‌దాస్ రైక్వార్
4. భిక్ల్య లడక్య ధిండా
5. బ్రిజ్ లాల్ భట్
6. బుద్రి తాటి
7. చరణ్ హేంబ్రామ్
 8. చిరంజీ లాల్ యాదవ్ 
9. ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్యా 
10. గఫ్రుద్దీన్ మేవతి జోగి
11. హాలీ వార్
12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ 
13. కె పజనీవేల్ 
14. కైలాష్ చంద్ర పంత్ 
15. ఖేమ్ రాజ్ సుందరియల్ 
16. కొల్లక్కైల్ దేవకి అమ్మ జి 
17. కుమారసామి తంగరాజ్ 
18. మహేంద్ర కుమార్ మిశ్రా 
19. మీర్ హాజీభాయ్ కసంభాయ్ 
20. మోహన్ నగర్ 
21. నరేష్ చంద్ర దేవ్ వర్మ
22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
23. నూరుద్దీన్ అహ్మద్ 
24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్ 
25. పద్మ గుర్మెత్ 
26. పోఖిల లెక్తేపి 
27. పున్నియమూర్తి నటేశన్ 
28. ఆర్ కృష్ణన్ 
29. రఘుపత్ సింగ్ 
30. రఘువీర్ తుకారాం ఖేద్కర్ 
31. రాజస్తపతి కాలియప్ప గౌండర్ 
32. రామారెడ్డి మామిడి 
33. రామచంద్ర గాడ్‌బోలే మరియు సునీత గాడ్‌బోలే 
34. ఎస్‌ జి  సుశీలమ్మ 
35. సంగ్యుసాంగ్ ఎస్ పొంజెనర్
36. షఫీ షౌక్
37. శ్రీరంగ్ దేవబా లాడ్ 
38. శ్యామ్ సుందర్ 
39. సిమాంచల్ పాత్రో 
40. సురేష్ హనగవాడి 
41. తగా రామ్ భీల్ 
42. టెకీ గుబిన్ 
43. తిరువారూర్ భక్తవత్సలం 
44. విశ్వ బంధు 
45. యుమ్నం జాత్రా సింగ్