హైదరాబాద్ గచ్చిబౌలిలో LSD పేపర్స్ స్వాధీనం... ఇద్దరు అరెస్ట్.

హైదరాబాద్ గచ్చిబౌలిలో LSD పేపర్స్ స్వాధీనం... ఇద్దరు అరెస్ట్.

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో LSD పేపర్లు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ శిల్ప లేఔట్ దగ్గర LSD పేపర్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న సూరజ్ అనే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతని దగ్గర నుంచి 80 వేల విలువచేసే 27 LSD పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సూరజ్ గోవా నుంచి LSD పేపర్స్ తెచ్చి హైదరాబాద్ లో రూ. మూడు వేలకు ఒక పేపర్ చొప్పున అమ్ముతున్నాడని తెలిపారు పోలీసులు. సూరజ్ సింగ్ తో పాటు కస్టమర్ గోపిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల దగ్గరి నుంచి  కారు మరియు స్కూటీ, మొబైల్ ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు...