జీవో 168 ప్రకారం బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలి : తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

జీవో 168 ప్రకారం బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలి : తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
  •     తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
  •     3న జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఆఫీస్​ల ఎదుట ధర్నాకు పిలుపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓపెన్ ప్లాట్ ఫేసింగ్ 20 అడుగుల కంటే తక్కువ ఉన్న ప్లాట్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా జీవో 168 ప్రకారం బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్​చేసింది. ఈ నెల 3న జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఆఫీస్​ల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్​కు వినతిపత్రం అందజేశారు. 

గత మూడు నెలలుగా 18 అడుగుల ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు అనుమతులు నిరాకరిస్తుండటంతో చిన్న రియల్టర్లు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పాత ఇళ్ల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు లభించడం లేదన్నారు. నగరంలో లక్షలాది ప్లాట్లు ఇలాగే ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.