కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లోని పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులతో కలసి మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 112 మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రి వివేక్. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు మంత్రి వివేక్.

చెన్నూరు,మందమర్రి లో కోటి రూపాయలతో షాదిఖానాలు, ఖబరస్తాన్ లను నిర్మిస్తున్నామని..మందమర్రి లో ఖబరస్తాన్ ప్రహరీ  నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేశామని అన్నారు. ATC సెంటర్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని..చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 బోర్లు వేసామని అన్నారు మంత్రి వివేక్.

తమ ప్రభుత్వం వచ్చాక త్రాగునీటి సమస్యలు తీర్చుతున్నామని... బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక పెద్ద ఫెయిల్యూర్ అని.. రూ.100 కోట్లతో పనులు జరుగుతున్న అమృత్ స్కీం పథకం ద్వారా చెన్నూరు నియోజక వర్గంలో ఇంటింటికి. తాగునీరు అందిస్తామని అన్నారు మంత్రి వివేక్. మందమర్రిలో పట్టా భూములు ఉన్న లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని అన్నారు మంత్రి వివేక్.