Gautam Gambhir: కావాలనే గిల్ని తప్పించి సూర్యకు కెప్టెన్సీ..  గంభీర్– అగార్కర్ నిర్ణయం భేష్

Gautam Gambhir: కావాలనే గిల్ని తప్పించి సూర్యకు కెప్టెన్సీ..  గంభీర్– అగార్కర్ నిర్ణయం భేష్

Gautam Gambhir: ప్లేయర్స్ మంచి ప్రదర్శన చేస్తే మ్యాచ్ లోనైనా టోర్నమెంట్ లోనైనా ఉంటారు. మరి వారిని నడిపించే సారథిగా కూడా అదే స్థాయిలో ఉండాలి. ఆ ఆటగాళ్లను ఎంపిక చేసే సెలక్టరుకి కాస్త పరిజ్ఞానం ఉండాలి. ఈ మూడు అంశాలు కుదిరితే 'కప్ గెలవడం' విజయవంతం అవుతుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్,- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ద్వయానికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జత కలవడంతో టీ20 ప్రపంచ కప్ ని భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీకి ముందు అగార్కర్–- గంభీర్ తీసుకున్న కఠిన నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందని చెప్పాలి.

రోహిత్ శర్మ టీ20లకి వీడ్కోలు చెప్పడంతో హార్దిక్ కి సారథ్య బాధ్యతలు ఇస్తారని అందరూ భావించారు.  కానీ సూర్యకుమార్ ని గంభీర్– అగార్కర్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ప్రపంచ కప్ ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లలో శుభ్ మన్ గిల్ ని సూర్యకు డిప్యూటీగా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. భవిష్యత్తులో గిల్ కే సారథ్యం అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. గిల్ వరుసగా విఫలం కావడంతో.. సూర్య కివీస్ తో జరిగిన సిరీస్ లో మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించడంతో.. అతడిపై నమ్మకం ఉంచిన అగార్కర్–-గంభీర్ కెప్టెన్ గా కొనసాగించారు. దీంతో సూర్య దూకుడుగా ఆడగలడని భావించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. గిల్ పై వేటు వేసింది. తమకు ఆడే విధానమే ముఖ్యం.. ఫామ్ తాత్కాలికమని ఇతర సభ్యులకూ హెచ్చరిక పంపినట్లు అయింది. దాదాపు 2 ఏళ్లు జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ దేశవాళీలో అదరగొట్టడంతో.. జాతీయ జట్టులో అతడికి మళ్లీ ఛాన్స్ కల్పించడం.. ఈ ప్రపంచకప్ లోనూ దూకుడుగా ఆడిన విషయం అందరికి తెలిసిందే. అందుకే, ఈ కప్ గెలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మన్, అజిత అగార్కర్ కి ఈ ట్రోఫీని అంకితం చేస్తున్నట్లు గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.  

ALSO READ : టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్గా సంజు శాంసన్

చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగుస్తుంది. ఇప్పటికే అతడి పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించింది. కానీ 2027లో వన్డే ప్రపంచ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, 2028లో ఒలింపిక్స్ పాటు అదే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉండటంతో.. అజిత్ పదవి కాలాన్ని మరికొంతకాలం పొడిగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే గంభీర్ పదవీకాలం కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ వరకు మాత్రమే ఉంది. వీరిద్దరిని మరికొంతకాలం ఉపయోగించుకుంటే మరిన్ని టైటిళ్లను టీమిండియా కైవసం చేసుకుంటుందుని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూర్య కుమార్ తన లక్ష్యాలేంటో క్లియర్ గా చెప్పేశాడు. ప్లేయర్ గా, కోచ్ గా ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ ను గెలిచిన గంభీర్.. వన్డే ప్రపంచ కప్ నూ సాధిస్తే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో పడటం ఖాయం. మరే ఇతర ప్రధాన కోచ్ కూడా ఇలాంటి చరిత్రను నమోదు చేయలేదు. ధోనీ నాయకత్వంలో గెలిచిన 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులోనూ గంభీర్ సభ్యుడే ఉన్నాడు.