కచ్చాబాదం ఫేమ్ అంజలి అరోరా బాయ్ ఫ్రెండ్ ఆకాష్ సంసన్యాల్ వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ ఎంపీ నకిలీ వెహికల్పాస్ వాడినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తనకారుపై మాజీ ఎంపీ కి చెందిన నకిలీ పాస్ వాడినందుకు మీరట్ పోలీసులు ఆకాష్ ను అరెస్ట్ చేశారు. కాశీ టోల్ ప్లాజా దగ్గర తనిఖీ చేస్తుండగా ఆకాష్ కారును పోలీసులు ఆపారు. అతని కారుపై ఉన్న పాస్ నకిలీదని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. అరెస్టయిన ఆకాష్ ను అంజలి ఆరోరా కలిసేందుకు సోమవారం పోలీస్స్టేషన్ కు వెళ్లింది. తన కాబోయే భర్త ను విడిచి పెట్టాలని పోలీసులను విజ్ణప్తి చేసింది. అరెస్టుపై ఆకాష్ సంసన్యాల్ వాదన మరోలా ఉంది. ఢిల్లీ మాజీ ఎంపీ రమేష్ బిధూరికి తాను పీఏ అని, అతని కుమారుడు సంజయ్ బిధూరికి మంచి ఫ్రెండ్నని చెబుతున్నాడు.
►ALSO READ | ఉత్తరప్రదేశ్ వంటకాలకు జియో ట్యాగింగ్ లతో అంతర్జాతీయ గుర్తింపు
గణతంత్ర దినోత్సవ భద్రతా తనిఖీల్లో భాగంగా గత రెండు రోజులుగా మీరట్టోల్ ప్లాజాలలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఆకాష్ ను అరెస్ట్ చేశారు. ఆకాష్ తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
