ఉత్తరప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్, వన్ కొసైన్ పథకం ద్వారా యూపీలోని 75 జిల్లాలనుంచి ఫేమస్ వంటకాలను గుర్తించి జియోట్యాగింగ్చేయడం ద్వారా అంతర్జాయతీ గుర్తింపు తెచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం (జనవరి26) ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికే యూపీ ప్రభుత్వ నిర్వహిస్తున్న వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రాడక్ట్ కు ఈ పథకాన్ని అనుసంధానం చేశారు.
ఓడీఓపీ ప్రోగ్రాం ద్వారా యూపీలోని ప్రాంతీయ ఉత్పత్తులకు జాతీయ, ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ODOC పథకం ద్వారాసాంప్రదాయ వంటకాలను జియోట్యాగింగ్ చేయడం ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపుతో ఫుడ్ బిజినెస్,ఆ రంగంలో పనిచేసే కార్మికులకు లబ్ది జరగనుంది. ఎంఎస్ ఎంఈల బలోపేతం, మార్కెట్ విస్తరించడం ద్వారా ఆర్థిక వృద్ధి పెంచుతుందని అధికారులు చెబుతున్నారు.
►ALSO READ | లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. యువకుడికి విముక్తి
ODOC పథకం ద్వారా యూపీ వంటల వారసత్వాన్ని ఆధునీకరించడంతో పాటు దానిని కాపాడుకునే అంశంపై దృష్టి పెడుతోంది. చారిత్రాత్మక వంటకాన్ని గుర్తించడం, చేతివృత్తులవారు,చెఫ్‌లను నమోదు చేయడం, నాణ్యత, పరిశుభ్రత ,ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడంతోపాటు బ్రాండింగ్, ప్యాకేజింగ్, GI ట్యాగింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తం చేయనున్నారు.
గుర్తించిన వంటకాలు..
- ఆగ్రా: పంచి పెథా
- మధుర: బ్రజ్వాసి పెడ
- అయోధ్య: రామసారే పెడ
- అలీఘర్: చంచమ్
- బారాబంకి: చంద్రకళ
- పూర్వాంచల్: బటి-చోఖా మరియు లిట్టి-చోఖా
- లక్నో: రెవ్డి ,మలై మఖన్
- వారణాసి: లాంగ్లటా ,మలైయో
- శాండిలా (హర్దోయి): లడ్డు
- కాన్పూర్: సమోసా
