టెహ్రాన్: గత 13 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మూడు దేశాల పోటాపోటీగా మిస్సైళ్లు, డ్రోన్లు, బాంబుల వర్షంతో పశ్చిమాసియా భగభగమంటుంది. ఈ క్రమంలో యుద్ధం ముగించేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. కానీ ఇందుకు మూడు కండీషన్లు పెట్టింది. ఈ షరతులకు అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే యుద్ధం ఆపేస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. జియోనిస్ట్ పాలన, అమెరికా రెచ్చగొట్టిన ఈ యుద్ధాన్ని ముగించడానికి పాకిస్తాన్, రష్యా దేశాలతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇరాన్ మూడు కండీషన్లు ఇవే:
1. ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించడం
2. ఈ యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి
3. భవిష్యత్‌లో ఎలాంటి దాడులు చేయబోమని దృఢమైన హామీ ఇవ్వాలి.
2026, ఫిబ్రవరి, 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా మెరుపు దాడులు చేయడంతో యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అగ్రనాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఓ వైపు ఇజ్రాయెల్‌తో పాటు మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్‌పై ఇరాన్ విరుచుకుపడుతుంది.
►ALSO READ | ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ అటాక్స్.. భారీగా చెలరేగిన మంటలు
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
క్రూడాయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్‌పై ఆధారపడ్డ దేశాలు అల్లాడిపోతున్నాయి. దీంతో యుద్ధం ముగించాలంటూ పలు దేశాలు పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధం ఆపేందుకు ముందుకు వచ్చింది. కానీ ఇందుకు మూడు కండీషన్లు పెట్టింది. మరీ ఇరాన్ కండీషన్లకు ఇజ్రాయెల్, అమెరికా ఒకే చెప్పి యుద్ధాన్ని ముగిస్తాయో లేదో చూడాలి..
