జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై ముగిసిన వాదనలు

జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై ముగిసిన వాదనలు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు, ఇతర అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కమిషన్ తన విచారణలో సహజ న్యాయసూత్రాలను పాటించలేదని, తమ వాదన వినకుండానే బాధ్యులను చేస్తూ నివేదిక ఇవ్వడం చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

రాజకీయ దురుద్దేశంతోనే నివేదికను ముందే బహిర్గతం చేసి తమ ప్రతిష్ఠ దెబ్బతీశారని, ప్రాజెక్టు వ్యయం ఇతర ప్రాజెక్టుల కంటే తక్కువే పెరిగిందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ బెంచ్.. తీర్పును విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఘోష్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌లపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది.