న్యూఢిల్లీ: లోక్సభలో తాను ఎవరి పట్లా పక్షపాతం చూపనని స్పీకర్ఓంబిర్లా అన్నారు. నిబంధనల మేరకే సభ నడుస్తుందని, సభలో సభ్యులందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరుసటి రోజు గురువారం ఓం బిర్లా తిరిగి లోక్‌సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై వచ్చిన ‘పక్షపాత ఆరోపణలను’ తోసిపుచ్చారు. ‘‘కొంతమంది ఎంపీలు మాట్లాడకుండా నేను అడ్డుకున్నానని ఆరోపించారు. కానీ, నేను సభలో ప్రతి ఎంపీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే, అది సభ నిబంధనలకు లోబడి మాత్రమే జరుగుతుంది. రూల్స్ ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి సమానం’’ అని అన్నారు.
