వెలుగు ఓపెన్ పేజీ : మహిళా శక్తికి తెలంగాణ సర్కార్ పునరంకితం

వెలుగు ఓపెన్ పేజీ : మహిళా శక్తికి తెలంగాణ సర్కార్ పునరంకితం

సమాజ ప్రగతికి మహిళల అభివృద్ధి అత్యంత కీలకం.  ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది,  కుటుంబాలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టేందుకు తెలంగాణలో సీఏం రేవంత్ రెడ్డి  సారథ్యంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత  ప్రాధాన్యతనిస్తోంది.  ఉక్కు మహిళ ఇందిరమ్మలాగ  రాష్ట్రంలోని ప్రతి మహిళను తీర్చిదిద్దేందుకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ‘మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలపరిచే దిశగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలను చేపట్టింది. మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన కోసం సమగ్ర చర్యలు తీసుకుంటోంది.  మంత్రి సీతక్క నాయకత్వంలో మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.

ఆరోగ్య భద్రతతోపాటు ఆర్థిక భద్రత

అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం ఈ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయాణిస్తూ నెలకు సుమారు నాలుగైదు వేల రూపాయల వరకు ఆదా చేసుకుంటున్నారు. ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటూ ఆర్థికంగా కొంత భారం తగ్గించుకుంటున్నారు. మహిళల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని భావించిన ప్రభుత్వం 65 లక్షల మహిళా సంఘ సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తోంది. ఆరోగ్య భద్రతతోపాటు ఆర్థిక భద్రత కూడా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల వరకు లోన్ బీమా,  పది లక్షల వరకు ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు రక్షణ కల్పిస్తోంది.  తెలంగాణలో మహిళా సంఘాల వ్యవస్థ బలంగా నిలబడేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 46.68 లక్షల గ్రామీణ పేద మహిళలను 4.37 లక్షల స్వయం సహాయక సంఘాలుగా సమీకరించి, వాటిని గ్రామ సంస్థలు, మండల, జిల్లా మహిళా సమాఖ్యలుగా విస్తరించింది. ఈ వ్యవస్థ ద్వారా మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు పొందుతున్నారు. 

వ్యాపారవేత్తలుగా  మహిళలు

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటి వరకు మహిళా సంఘాలకు రూ.36 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించింది. అంతేకాకుండా వడ్డీ లేని రుణాల పథకం కింద రెండేళ్లలోనే రూ.1,121 కోట్ల వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించింది.  2014–15లో ఒక్కో సంఘానికి సగటు రుణం రూ.1.90 లక్షలు ఉండగా,  2025–26 నాటికి అది రూ.9.55 లక్షలకు పెరగడం మహిళా ఆర్థిక ప్రగతికి సూచిక. మహిళల స్వయం ఉపాధికి అనేక వినూత్న అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకుపైగా మైక్రో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు స్థాపించబడి వేలాది మహిళలకు ఉపాధి లభిస్తోంది. మండల మహిళా సమాఖ్యలు పెట్టుబడితో 600 బస్సులు కొనుగోలు చేసి టీజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఇందిరమ్మ క్యాంటీన్లు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్ కుట్టు పనులు వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. హైదరాబాద్ ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన  ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ గ్రామీణ మహిళా వ్యాపారులకు పట్టణ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానంగా మారింది. 

మహిళల సంఘటిత శక్తి బలోపేతం

 మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి సరికొత్త రంగాల్లో అడుగుపెడుతూ నెలకు లక్షల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాలను నిర్మిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా టీనేజీ బాలికలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా పంచుకుంటోంది. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు క్రెచ్ కేంద్రాలను ప్రారంభిస్తోంది. 

మహిళా సాధికారత ఉద్యమం

వలస కూలీల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందించేందుకు 100 ఎం.ఎల్ పాలు సరఫరా చేయడంతో పాటు.. వారికి పౌష్టికాహారం అందించేందుకు మొబైల్ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. త్వరలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ పథకం ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.  మొత్తం మీద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతను ఉద్యమంగా మార్చింది. మహిళలను కుటుంబానికి పరిమితం చేసే పరిస్థితుల నుంచి బయటకు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా నిలబెడుతోంది. తెలంగాణలో మహిళా సాధికారత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళల శక్తిని గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తే సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో  తెలంగాణ మోడల్ మరోసారి నిరూపిస్తోంది.

- ఇందిరా శోభన్,
కాంగ్రెస్  సీనియర్ నేత