ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నారా జాగ్రత్త.. చిన్న తప్పిదం ఎంత పనిజరిగిందో చూడండి

ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నారా జాగ్రత్త.. చిన్న తప్పిదం ఎంత పనిజరిగిందో చూడండి

కొన్ని కొన్ని సార్లు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఏకంగా ప్రాణాలను తీస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ పరికరాలు ఫ్యాన్, టీవీ, ఫ్రిజ్, కూలర్, ఏసీ, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ హీటర్ వంటి వాటిపట్ల అజాగ్రత్తగా మూల్యం చెల్లించుకోక తప్పుదు. వేడినీళ్ల కోసం పెట్టిన  హీటర్ తగిలి కరెంట్ షాక్ తో ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మేడ్చల్ జిల్లాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

మేడ్చల్ జిల్లాలో  మేడిపల్లిలో వేడి నీళ్ల కోసం బకెట్లో పెట్టిన ఎలక్ట్రిక్ హీటర్ వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. ప్రమాదవ శాత్తు ఎలక్ట్రిక్ హీటర్ ఉంచిన బకెట్ పై పడటంతో కరెంట్ షాక్ తగిలి మహిళ స్పాట్ లోనే చనిపోయింది.  ఈ ప్రమాదం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ లో సోమవారం (జూలై27) జరిగింది. 

మల్లికార్జున్ నగర్ లో నివాసముండే బుడ్డికారి స్వాతి (40) అనే గృహిణి .. వేడినీళ్ల కోసం బకెట్ లో హీటర్ పెట్టింది. అయితే అనుకోకుండా ఫ్లోర్ జారడంతో బకెట్ లో ఉన్న హీటర పై పడటంలో కరెంట్ షాక్ తగిలింది. దీంతో స్వాతి అక్కడిక్కడే మృతి చెందింది.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.