మూత్రం పోశాడని.. ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి కత్తితో వాతలు పెట్టిన టీచర్

 మూత్రం పోశాడని.. ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి కత్తితో వాతలు పెట్టిన టీచర్

 ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ఉత్తరప్రదేశ్ వారణాసిలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.  ఓ ఐదేళ్ల చిన్నారి పట్ల ప్రైవేట్ స్కూల్ టీచర్ రాక్షసంగా ప్రవర్తించింది. మానవత్వం మరిచి ఆమె చేసిన పనికి అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

వారణాసిలోని పాండేపూర్‌ ఉన్న సరీన్ సోని ప్లే స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు, తరగతి గదిలో ఆడుకుంటుండగా అనుకోకుండా నిక్కర్ లో  మూత్రం పోశాడు. వాష్‌రూమ్‌కి వెళ్లేందుకు టీచర్ అనుమతి ఇవ్వకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. అయితే దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు.. చిన్నారిని మరో గదికి తీసుకెళ్లింది. గ్యాస్ స్టవ్‌పై కత్తిని బాగా వేడి చేసి  ఆ బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వాతలు పెట్టింది.

►ALSO READ | ఆందోళనకారులకు అండ: కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్

స్కూల్ ముగిశాక తీవ్ర నొప్పితో ఇంటికి వెళ్లిన బాలుడు రోదించడంతో తల్లిదండ్రులు పరిశీలించారు. అసలు విషయం తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. బాలుడి ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన కాలిన గాయాలు, బొబ్బలు ఏర్పడ్డాయి. వెంటనే బాధితుడి తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్‌ను కలిసి నిలదీసినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

దీంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. లాల్‌పూర్-పాండేపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితురాలైన టీచర్పాటు స్కూల్ ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.