ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి : ఎస్సీ ఉపకులాల నేతలు

ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి : ఎస్సీ ఉపకులాల నేతలు
  • మంత్రి అడ్లూరిని కోరిన ఎస్సీ ఉపకులాల నేతలు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీలోని 57 ఉపకులాల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని, రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఇందుకు నిధులు కేటాయించాలని ఎంబీఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి నేతలు కోరారు. ఈ మేరకు గురువారం ఎంబీఎస్సీ 57 ఉపకులాల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ బైరి వెంకటేశంతో పాటు పలువురు నేతలు మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ ఉపకులాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని మంత్రిని వెంకటేశం కోరారు. ఎస్సీ ఉపకులాల ప్రజలందరికీ తహసీల్దార్ల ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. నేతల విజ్ఞప్తిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.