బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ 

బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్ 
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్​కోటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ డిమాండ్ ​చేశారు. చట్టసభల్లో అన్ని వర్గాల మహిళలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలన్నారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం, బీసీ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లోని ఖైరతాబాద్ లో గల మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో మహిళా దినోత్సవం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మహిళలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేకపోవడం వల్ల అగ్ర కుల నాయకులకుటుంబసభ్యులే చట్టసభల్లోకి అడుగు పెడతారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం సబ్ కోటా కల్పించినప్పుడే మహిళా బిల్లుకు అర్థం ఉంటుందని పేర్కొన్నారు.