ఒక్కరోజే 12 లక్షల గ్యాస్ బుకింగ్స్ : భయంతో ఆర్డర్లు పెట్టేశారు..!

ఒక్కరోజే  12 లక్షల గ్యాస్ బుకింగ్స్ : భయంతో ఆర్డర్లు పెట్టేశారు..!

 దేశంలో గ్యాస్, పెట్రోల్,డీజిల్  సంక్షోభం  లేదని కేంద్రం స్పష్టం చేసింది.  గ్యాస్ పై ఆందోళన చెందవద్దని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశంలో ఎల్పీజీల  ఉత్పత్తి 30 శాతం పెంచామని చెప్పారు. మన రిఫైనరీలు వంద శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అనవసరం వదంతులు వ్యాప్తి చేయొద్దని సూచించారు. కృత్రిమ గ్యాస్  కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య వినియోగదారుల సమస్యలు తీరుస్తామని చెప్పారు. పోర్టుల్లో ఎల్పీజీ  నౌకలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. 

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళన పరిస్థితుల కారణంగా ఇటీవల ఇండియాలో ఎల్పీజీల బుకింగ్  సంఖ్య  గణనీయంగా పెరిగిందన్నారు. నిన్న సుమారు 75 లక్షల నుంచి 76 లక్షల బుకింగ్‌లు ఉంటే అది   ఇప్పుడు దాదాపు 8.8 మిలియన్లకు పెరిగిందని చెప్పారు.  వినియోగదారులు అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేయొద్దని సూచించారు.  అయితే భారత్ లో ప్రస్తుతం తగినంత ముడి చమురు సరఫరాలు ఉన్నాయని శర్మ స్పష్టం చేశారు.

►ALSO READ | హోటళ్లు, టీ కొట్టులకు గుడ్ న్యూస్: యూనిట్ కరెంటుపై రూ.2 తగ్గింపు!

మేము ఇంతకుముందు మొత్తం 27 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకునేవాళ్ళం; ఇప్పుడు ప్రభుత్వం ముడి చమురు దిగుమతుల కోసం 40 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మేము మా సరఫరా మార్గాలను వైవిధ్యపరిచాము," అని ఆయన అన్నారు, ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సరఫరా అంతరాయాలు నివేదించబడినప్పటికీ, దేశంలో నిరంతర సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.