చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ.. విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్

చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ.. విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్

తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది.  మార్చి 13 న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది. 

మార్చి 13న తెలంగాణ విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజున 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, గత రికార్డు  335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025) ను అధిగమించింది. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ.ఉష్ణోగ్రతలు పెరగడం , వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం, గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి.

భవిష్యత్తు అవసరాలకు సిద్ధం: డిప్యూటీ సీఎం

రాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయి. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్ ,సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది అని  డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 

►ALSO READ | ఇళ్ల గ్యాస్ బండలకు ఇబ్బంది లేదు.. అవసరం లేకపోయినా బుక్ చేయొద్దు : మంత్రి ఉత్తమ్