ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు..వేరే మహిళను పెళ్లిచేసుకున్నాడు..దీంతో మాజీ ప్రియురాలు అతనిపై కక్ష కట్టింది. ప్రతీకారం తీసుకోవాలనుకుంది..తాను చేస్తున్న వృత్తినే ఆయుధంగా వాడుకుంది. ఎవరికీ అనుమానం రాకుండాఅతని కుటుంబంపై పగసాధించాలని ప్లాన్ వేసింది. సంతోషంగా మాజీ ప్రియుడి కుటుంబాన్ని అగాధంలోకి నెట్టింది.. తాను జైల్లో ఊచలు లెక్కపెడుతోంది.
ఏపీలోని కర్నూల్ జిల్లాలో మాజీ ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ రక్తం ఎక్కించి అతని కుటుంబాన్ని ప్రమాదంలోకి భయంకరమైన, దిగ్బ్రాంతి కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 9 న ఘటన జరిగింది. అసూయ, ప్రతీకారంతో ఓకుటుంబం భవిష్యత్తును అంధకారం చేసిన ప్రధాన సూత్రధారి , నర్సు వసుంధర, ఆమెకు సాయం చేసిన నలుగురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూల్ మెడికల్ కాలేజీ డాక్టర్ అయిన డాక్టర్ కరుణాకర్, నిందితురాలు నర్సు వసుంధర కొంత కాలం ప్రేమించుకున్నారు. అయితే వసుంధరను కాదని మరో డాక్టర్ శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో డాక్టర్కరుణాకర్ పై కక్ష పెంచుకున్న వసుంధర.. ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర పన్నింది. ఆస్పత్రిలో తనకున్న పరిచయాలతో HIV రక్తాన్ని సేకరించింది. ప్రమాదంలో గాయపడిన డాక్టర్ శ్రావణికీ ఆ రక్తాన్ని ఎక్కించినట్లు పోలీసులు విచారణలో భయంకరమైన వాస్తవం వెలుగుచూసింది.
పోలీసుల విచారణలో ఇంకా దిగ్భ్రాంతికర విషయాలు బయటికొచ్చాయి. జనవరి 9న ఆస్పత్రినుంచి స్కూటర్ పై ఇంటికి వెళ్తున్న శ్రావణిని ఉద్దేశ్యపూర్వకంగానే బైక్ తో ఢీకొట్టించింది. దీంతో శ్రావణి ఎముకలు విరిగాయి. బైక్ వచ్చిన వసుంధర, ఆమె స్నేహితురాలు కలిసి శ్రావణిని చికిత్సకోసం తరలించేందుకు ఆటో రిక్షా ఎక్కించారు. మార్గమధ్యలో తనతో తెచ్చుకున్న HIV వైరస్ రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది. అది గమనించిన శ్రావణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ఉద్దేశ్యపూర్వకంగానే రోడ్డు ప్రమాదం సృష్టించి కలుషిత రక్తం ఎక్కించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డాక్టర్ దంపతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితురాలు వసుంధర, ఆమెకు సహకరించిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమదైన శైలీలో విచారించడంతో అసలు నిజాలు బయటికొచ్చాయి. ప్రస్తుతం వసుంధర తోపాటు మరో నలుగురు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.
