- కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ రూరల్, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు నమిండ్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెలిచాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో చేగుర్తి సర్పంచి భాషవేణి సరోజన, అంజయ్య, ప్రశాంత్ రెడ్డి, శంకర్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.
