హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభ, శాసన మండలికి కొత్త విప్‌లను నియమించింది. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌లుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నియమితులయ్యారు. శాసన సభలో ప్రభుత్వ విప్‌లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం (మార్చి 19) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామాకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల వేళ ప్రభుత్వ విప్ల నియాకమం ప్రాధాన్యత సంతరించుకుంది.
