ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు దాదాపు చివరి దశకు చేరుకుంటున్న వేళ బులియన్ మార్కెట్లలో బూమ్ మళ్లీ స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే అమెరికా డాలర్ బలంగా ఉండటం కొంత మేర ఈ దూకుడుకు కట్టడి వేస్తోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ గడచిన 15 రోజులుగా తగ్గిన గోల్డ్ రేట్లు తిరిగి పుంజుకోవటం ఆందోళన కలిగిస్తోంది రిటైల్ కొనుగోలుదారులకు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలను పరిశీలించి షాపింగ్ చేయటం బెటర్.
జూన్ 22న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.43 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 651గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 430గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 22, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.
