న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆదివారం (జూన్ 21) బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టును యువ బ్యాటర్ శుభమన్ గిల్ లీడ్ చేయనున్నాడు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లాండ్ టూర్‌కు యంగ్ బ్యాటర్ యశస్వీ జైశ్వాల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు.
ఆప్ఘాన్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో రాణించినప్పటికీ ఇంగ్లాండ్ టూర్‌కు బీసీసీఐ జైశ్వాల్‌ను పక్కన పెట్టింది. సెంచరీతో చెలరేగినప్పటికీ జైశ్వాల్‌కు బీసీసీఐ మొండి చేయి చూపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ నిర్ణయాన్ని కొందరు తీవ్రంగా తప్పబడుతున్నారు.
బీసీసీఐ పక్షపాతంగా వ్యవహరిస్తుందని.. కొందరు ప్లేయర్లు విఫలమైన వరుసగా అవకాశాలు ఇస్తోందని.. అదే జైశ్వాల్ సెంచరీ చేసినప్పటికీ పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదేమి న్యాయం.. సెంచరీ చేసిన జట్టులో చోటు కల్పించరా అంటూ బీసీసీఐ తీరును తప్పబడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. జట్టులో చోటు దక్కాలంటే జైశ్వాల్ ఇంకేం చేయాలో చెప్పండి మరీ అంటు అతడి ఫ్యాన్స్ బీసీసీఐపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న జైశ్వాల్ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు.
►ALSO READ | పాక్ బౌలర్ని కొట్టడానికి వెళ్లిన పోలార్డ్.. గొడవ జరగానికి అసలు కారణం ఇదే!
ఇండియా, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్:
* జూలై 14 (ఎడ్జ్ బాస్టన్)
* జూలై 16 (సోఫియా గార్డెన్స్)
* జూలై 19 (లార్డ్స్)
ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా స్క్వాడ్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
