పాక్ బౌలర్ని కొట్టడానికి వెళ్లిన పోలార్డ్.. గొడవ జరగానికి అసలు కారణం ఇదే!

పాక్ బౌలర్ని కొట్టడానికి వెళ్లిన పోలార్డ్.. గొడవ జరగానికి అసలు కారణం ఇదే!

Kieron Pollard: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో ఒక అదిరిపోయే హై-డ్రామా మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన MI న్యూయార్క్ (MI New York) కెప్టెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో విద్వంసకర సెంచరీ (100)* బాది ఒంటిచేత్తో రచ్చ లేపాడు. కేవలం 56 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించాడు. 2022 లోనే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా.. తన పవర్‌లో ఏమాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తూ టి20 క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ (14,562 రన్స్) ఆల్‌టైమ్ రికార్డును పొలార్డ్ బద్దలుకొట్టాడు. 

పాక్ బౌలర్‌పైకి బ్యాట్ ఎత్తిన పొలార్డ్: 
గతంలో ఐపీఎల్ 2014లో మిచెల్ స్టార్క్‌పైకి పొలార్డ్ బ్యాట్ విసిరిన సీన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా నిలిచింది. సరిగ్గా అలాంటి సీనే నిన్న మళ్లీ రిపీట్ అయింది. పొలార్డ్ 21 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. పాకిస్థాన్ మూలాలున్న యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మెహమూద్ వేసిన బాల్ ని పొలార్డ్ డిఫెన్స్ ఆడగా.. బాల్ అందుకున్న ఆసిఫ్, పొలార్డ్ వైపు విసురుతానంటూ అగ్రెసివ్‌గా సైగ చేశాడు. దాంతో మన క్లచ్ గాడ్ కు ఈగో హర్ట్ అయింది.. ఆ వెంటనే కోపంతో ఊగిపోతూ బౌలర్ ఆసిఫ్‌పైకి బ్యాట్ విసిరేందుకు రెడీ అయిపోయాడు. లక్కీగా లాస్ట్ సెకండ్‌లో పొలార్డ్ తనను తాను కంట్రోల్ చేసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది కానీ, ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాత్రం గట్టిగా కొనసాగింది.  

►ALSO READ | మ్యాచ్ జరుగుతుండగానే బీర్లు తాగిన జర్మనీ ప్లేయర్లు?.. నెట్టింట వీడియో వైరల్!

పొలార్డ్ వన్-మాన్ షో వృథా: 
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ కొట్టిన కొట్టుడికి రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ ఓవెన్ కేవలం 68 బంతుల్లో 13 సిక్సర్లు, 11 ఫోర్లతో 155 రన్స్ తో చెలరేగడంతో.. వాషింగ్టన్ టీమ్ 20 ఓవర్లలో 245/5 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌లో క్వింటన్ డి కాక్ (0), పూరన్ (11) లు ఫెయిల్ అవ్వడంతో ఎంఐ టీమ్ కష్టాల్లో పడింది. ఆ టైమ్‌లో పొలార్డ్ తన సెంచరీతో నెక్స్ట్ లెవెల్ వన్-మాన్ షో చూపించినా.. మిగతా ప్లేయర్స్ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో ఎంఐ న్యూయార్క్ 215/6 రన్స్ మాత్రమే చేసి 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సీఎస్‌కే సిస్టర్ టీమ్‌తో రైవల్రీ ఫైట్: 
ఎంఐ న్యూయార్క్ టోర్నీని ఓటమితో స్టార్ట్ చేసి పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. అయితే వీళ్లు లాస్ట్ ఇయర్ (MLC 2025) కూడా ఫస్ట్ 7 మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచి, ఆ తర్వాత హిస్టారికల్ కమ్‌బ్యాక్ ఇచ్చి టైటిల్ కొట్టారు కాబట్టి ఫ్యాన్స్ పెద్దగా టెన్షన్ పడట్లేదు.. ఇక వీళ్ల నెక్స్ట్ మ్యాచ్ సోమవారం (జూన్ 22న) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రేరీ స్టేడియంలో జరగబోతోంది. ఐపీఎల్‌లో ముంబైకి బిగ్గెస్ట్ రైవల్ అయిన సీఎస్‌కే సిస్టర్ ఫ్రాంచైజీ.. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని టెక్సాస్ సూపర్ కింగ్స్ (Texas Super Kings) తో పొలార్డ్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎంఐ మొదటి విక్టరీ కొడుతుందో లేదో వేచి చూడాలి.