మ్యాచ్ జరుగుతుండగానే బీర్లు తాగిన జర్మనీ ప్లేయర్లు?.. నెట్టింట వీడియో వైరల్!

మ్యాచ్ జరుగుతుండగానే బీర్లు తాగిన జర్మనీ ప్లేయర్లు?.. నెట్టింట వీడియో వైరల్!

ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) గ్రూప్-ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌ మధ్యలో హైడ్రేషన్ బ్రేక్ ఇచ్చినప్పుడు.. జర్మనీ ఫుట్‌బాల్ ప్లేయర్స్ అందరూ టచ్‌లైన్ దగ్గర నిలబడి క్యాజువల్‌గా బీర్ తాగుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇది చూసిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవ్వడమే కాదు.. ఏంటి మావా బ్రో, ఫిఫా రూల్స్ ఏమైనా మార్చిందా? మ్యాచ్ మధ్యలో బీర్లు తాగడానికి అప్రూవల్ ఇచ్చేసిందా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

AI మ్యాజిక్: 
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ వీడియో 100 శాతం ఫేక్ అని తేలిపోయింది. అది పూర్తిగా AI-Generated (డిజిటల్లీ మానిప్యులేటెడ్) వీడియోని కాస్త నిశితంగా గమనిస్తే.. అందులోని ప్లేయర్స్ ముఖాలు (Facial features) వింతగా మారడం, వాళ్ల చేతుల కదలికలు సహజంగా లేకపోవడం క్లియర్‌గా కనిపిస్తుంది. జర్మనీ టీమ్ జెర్సీ డీటెయిల్స్ కూడా ఒరిజినల్‌లా లేవు.. అంతేకాదు, వాళ్లు పట్టుకున్న బీర్ బాటిల్స్ షేప్స్ కూడా సెకనుకో రకంగా మారుతూ AI టెక్నాలజీతో క్రియేట్ చేశారని ఈజీగా తేలిపోయింది. 

అసలేం జరిగిందంటే: 
నిజానికి ఆ మ్యాచ్‌లో జర్మనీ జట్టు ఐవరీ కోస్ట్‌పై 2–1తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. కానీ, అఫీషియల్ మ్యాచ్ బ్రాడ్‌కాస్ట్‌లో గానీ, అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసిన పిక్స్‌లో గానీ జర్మనీ ప్లేయర్స్ బీర్ తాగినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా జర్మనీ కోచింగ్ స్టాఫ్ కానీ, ప్లేయర్స్ కానీ దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

►ALSO READ | భారత్-దక్షిణాఫ్రికా మహిళల పోరుకు వర్షం ముప్పు?.. మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్ ఇదే!

ఫిఫా స్ట్రిక్ట్ రూల్స్: 
ఫిఫా (FIFA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్స్ ఆల్కహాల్ తీసుకోవడం కంప్లీట్‌గా నిషేధం.. బ్రేక్స్ సమయంలో ప్లేయర్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి కేవలం వాటర్, ఎనర్జీ డ్రింక్స్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.