భారత్-దక్షిణాఫ్రికా మహిళల పోరుకు వర్షం ముప్పు?.. మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్ ఇదే!

భారత్-దక్షిణాఫ్రికా మహిళల పోరుకు వర్షం ముప్పు?.. మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్ ఇదే!

IND-W vs SA-W: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు (జూన్ 21, ఆదివారం) మాంచెస్టర్‌లోని ఐకానిక్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో మంచి జోషలో ఉంది. గ్రూప్-A పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకుపోతూ సెమీస్ బెర్త్ వైపు కన్నేసింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన కెరీర్‌లో 42వ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేయనుంది. మరోవైపు టోర్నీలో ఇప్పటి వరకు కాస్త సైలెంట్‌గా ఉన్న లారా వాల్వార్ట్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు.. ఈసారి భారత్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయింది.

ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ రిపోర్ట్:  
మాంచెస్టర్ పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు ఇద్దరికీ సమానంగా హెల్ప్ అయ్యేలా పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ గ్రౌండ్‌లో జరిగిన గత మహిళల టి20 మ్యాచ్‌ల రికార్డులు చూస్తే.. 50 శాతానికి పైగా వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. కాబట్టి మిడిల్ ఓవర్లలో దీప్తి శర్మ, శ్రీ చరణిల స్పిన్ అటాక్ భారత జట్టుకి చాలా కీలకం కాబోతోంది. ఇక ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని బోర్డుపై భారీ స్కోర్ సెట్ చేయడం ఖాయం. 

►ALSO READ | తెలంగాణ.. మన క్రికెట్ షురూ!.. టీజీ20 ఆంథమ్‌లో విజయ్ దేవరకొండ రచ్చ

మాంచెస్టర్ వెదర్ రిపోర్ట్: 
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ మ్యాచ్‌కు వరుణుడి గండం అస్సలు లేదు.. మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రత దాదాపు 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది కాబట్టి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండబోతోంది. వర్షం పడే ఛాన్స్ కేవలం 5 శాతం మాత్రమే ఉంది. క్లౌడ్ కవర్ 42 శాతం ఉన్నప్పటికీ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే సీనే లేదు.. కాబట్టి 40 ఓవర్ల ఫుల్ మ్యాచ్‌ను మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. 

ఇరు జట్ల బలాబలాలు: 
టీమిండియాలో ఓపెనర్ స్మృతి మంధాన వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో బీభత్సమైన ఫామ్‌లో కనిపిస్తుంది. ఆమెకు తోడుగా షఫాలీ వర్మ ఆల్ రౌండ్‌ షోతో అదరగొడుతుండగా, మిడిల్ ఆర్డర్‌లో రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు సౌతాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో అన్నెరి డెర్క్‌సెన్, నాడిన్ డి క్లెర్క్‌లపై ఆ జట్టు ఆశలు పెట్టుకోగా.. బౌలింగ్‌లో లెజెండరీ ప్లేయర్ మరిజానే కాప్ రూపంలో భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది.