ఆధ్యాత్మికం: గృహదేవత ఆరాధన చాలా ముఖ్యం.. లేకపోతే దరిద్రం.. శాపాలు వెంటాడుతాయి..!

ఆధ్యాత్మికం:  గృహదేవత ఆరాధన చాలా ముఖ్యం.. లేకపోతే దరిద్రం.. శాపాలు వెంటాడుతాయి..!


హిందువులు.. శుభకార్యాలు మొదలు పెట్టేముందు సాధారణంగా వారి గృహదేవతను.. ఇంటిదేవతను పూజిస్తారు.  ముందుగా వారిని పూజించి.. వారి ఆశీస్సులను పొంది.. తరువాత కార్యక్రమం చేయడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం.  ఈ పూజలు.. వారి ఇంటి ఆచారాల ఆధారంగా ఉంటాయి. కుల దేవతలను.. ఇంటి దేవతలను ఎలా పూజించాలి.. పూజించకపోతే వచ్చే నష్టం ఏమిటి.. పండితులు ఏమంటున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

హిందువులు ఆచారాలు.. సంప్రదాయాలకు చాలా పెద్ద పీట వేస్తారు.  ఏశుభకార్యం జరిగినా ముందుగా ఇంటి దేవతను.. అలాగే కుల దేవతను పూజిస్తారు.   గృహ దేవతలకు సేవ చేయడం అనేది దైవంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించే ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక చర్య.  కొంతమంది అద్దె ఇల్లు మారినా .. కుల దేవతలను పూజిస్తారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం మనం నివసించే గృహాలలోను, భవంతులలోను వాటినినిర్మించే ముందే‌ ఒక దైవీక శక్తి  ఉంటుంది.  ఆ శక్తి ప్రదేశాలను అక్కడ ఉండే వారిని రక్షింస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలా రక్షించే  దేవతనే గృహ దేవత అంటారు.

తెలుగు రాష్ట్రాల్లో గృహ దేవతలు, కుల దైవాలను ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.  వివాహాలు లేదా ఇతర శుభకార్యాల సమయంలో తమ గృహ దేవతలకు మొక్కులు చెల్లించి పూజలు చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.

గృహదేవతను నిత్యం స్మరించాలి.. సమయాన్ని బట్టి పూజించాలి.  ఇలా రోజూ చేయకపోయినా.. ఇంట్లో శుభ కార్యాలు ప్రారంభించే సమయంలో కచ్చితంగా చేయాలి.  అప్పుడే ఆ గృహంలో నివసించే వారి  అభీష్టాలను నెరవేరు స్తుందని చెబుతారు .అందుకే పెళ్లిళ్లు.. ఉపనయానాలు.. ఇతర పెద్ద శుభ కార్యాలు చేసేటప్పుడు.. ఫంక్షన్​ హాల్స్​ లో చేసినా...  గృహదేవత పూజ మాత్రం వారు నివసించే గృహంలో చేయాలని పండితులు చెబుతున్నారు. వీరితో వారి పెద్దలను కూడా పూజించి కచ్చితంగా ఆశీర్వాదం తీసుకోవాలి.  

పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. ఈ దేవతకి ఒక ప్రత్యేక రూపమంటూ ఏమీ లేదు, వెలిగే దీపాలలో జ్వాలా రూపంగా అనుగ్రహిస్తుంది.ఈ గృహ దేవతని సంధ్యాసమ యాల్లో, ధాన్యం, పుష్పాలు , జల్లి పూజించే వారని తమిళ సంగం కాల కావ్యాలు చెప్తున్నాయి.జ్యోతి వెలుగులో దేవతలున్నందున, యీ దీపాన్ని 'కామాక్షి దీపం' అని పిలిచేవారు.

దేవాలయాలలో అర్చనలు చేస్తున్నప్పుడు 'ఇష్ట కామ్యార్ధ సిద్ద్యర్ధం' అని అనడం వింటూంటాం, అభీష్ట సిధ్ధిఅనిఅర్ధం.కోరుకున్నవాటినిఅనుగ్రహించి, మానవాళినిసంతోష పెట్టే దేవి'కామ్య యక్షి' అని పిలువ బడుతోంది.

ఆ దేవి యే గృహ దేవత, ఆ దేవి రూపమే దీప జ్వాల,ఆ జ్వాలా దీపాన్నే'కామ్య యక్షి' దీపం అంటారు....కాలక్ర మేణా,పలుకుబడి లో "కామాక్షి దీపం "గా మారింది.కామాక్షి దీపం ప్రమిదను వివిధ లోహ రూపంగా తయారు చేసి పీఠంమీదఅమర్చుతారు.విశేష పండుగ రోజుల లోఆ దీపాన్ని గోవుపేడవుండల మీద అమర్చేఆచారం కూడా వున్నది.ఆవు పేడలో లక్ష్మీ దేవివుంటుందని దానినికామాక్షీ దీపానికి పీఠంగాఏర్పరుస్తారు .

ప్రాచీనకాలంలో యీ కామాక్షి దీపాన్ని దేవతల రూపంతో నిర్మించే ఆచారం వుండేది కాదు.తరువాత కాలంలో‌జ్యోతి స్వరూపాన్ని 'దీపలక్ష్మి' అని అనడమేకాకుండా, ఆ దీపానికిగజ లక్ష్మీ రూపం అమర్చడం కూడా ఒక సంప్రదాయం గామారింది.ఈ నాడు గృహస్తులు వారివారి ఇష్ట దైవాలను అమర్చుకుంటున్నారు, 

వివాహ సమయంలో యీ కామాక్షి దీపాన్ని నూతన వధువుకు సారెగా యిచ్చే ఆచారం కూడా ఏర్పడింది.వివా హమై అత్తవారింట్లో ప్రవేశించే ముందు పెళ్లి కూతురు చేతిలో యీ దీపం పెట్టి, అత్తింటివారు కొత్త కోడలిని లోపలికి ఆహ్వానిస్తారు....

కామాక్షి దీపాన్ని కేవలం వెలుగును యిచ్చే ఒక సామాన్య దీపంగా భావించకూడదు. ఆ సింహాసనంలోకాంతి రూపంలో ఆశీనురాలైవున్న జ్యోతి స్వరూపిణియైన అమ్మవారిగా భావించాలి.ఆ జ్యోతి స్వరూపాన్ని పుష్పాలతో అలంకరించి ధూప , దీప , నైవేద్యాలతో పూజించాలి. అందులో ఊదువత్తులు వెలిగించి పెట్టడం కాని, కర్పూరం వెలిగించడం కాని చెయ్యకూడదు.ఇరవై నాలుగు గంటలుకామాక్షి దీపాన్ని వెలిగించివుంచడం మంచిది, 

అలా చేయలేని పక్షంలో...ప్రాతః, సాయంకాలసమయాలలో దీపం వెలిగించి, పువ్వులతో అలంకరించి, పూజించాలి.కామాక్షి దీపం సదా ప్రకాశించే గృహాలలో, ఎల్లప్పుడూ , సిరిసంపదలతో సంతోషం తాండవిస్తుంది.కామాక్షి దీపాన్ని ఆవునేతితో వెలిగిస్తే, ఆ గృహంలో దైవీక శక్తితాండవిస్తుంది...

గృహ దేవతలకు సేవ చేయడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తి, గౌరవాలను సూచిస్తుంది. గృహదేవతల పూజ వలన లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని పెంపొందించుకుని, నిత్య జీవితంలో దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారని  పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.