కొండగట్టులో  రెండోసారి వేలం రద్దు

కొండగట్టులో  రెండోసారి వేలం రద్దు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో టెండరుదారులు కుమ్మక్కై వరుసగా రెండోసారి వేలాన్ని బహిష్కరించారు. దీంతో అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ఆలయంలో కొబ్బరి కాయలు, హోటల్ తదితర 14 రకాల షాపుల నిర్వహణకు గత నెల 18న టెండర్లు నిర్వహించగా, రూల్స్ మార్చాలని కోరుతూ వ్యాపారులు పాల్గొనలేదు.