ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందరాంలో  ముస్లింసోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందారంలోని మసీదు ప్రాంగణంలో వాటర్ షెడ్డు ప్రారంభించిన మంత్రి.. కలెక్టర్ కుమార్ దీపక్ తో కలసి తోఫా పంపిణీ చేశారు. ముస్లింసోదరసోదరీమణులకు  అడ్వాన్స్డ్ విషెస్ తెలిపారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. ముస్లింల అభివృద్దికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా  ఇందారంలో  విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. గ్రామంలో 36 బోర్ వెల్స్ వేయించామన్నారు. 

చెన్నూర్ నియోజకవర్గంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి. ముస్లిం కోసం చెన్నూరులో రూ. 50 లక్షల నిధులతో షాదీఖానా నిర్మిస్తున్నామన్నారు. జైపూర్ లో త్వరలో 3x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రారంభిస్తామన్నారు.ఈ ప్లాంట్ తో స్థానిక యువతకు  ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మంత్రి. 

మరోవైపు RK5లో కొత్త ఓపెన్ కాస్ట్ మైన్ రాబోతోందన్నారు మంత్రి వివేక్. చెన్నూరులో ATC సెంటర్ ను నిర్మిస్తామన్నారు..యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి స్కిల్స్ ఉంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పేదలకు నాణ్యమైన విద్య అందించేందకు రూ. 250 కోట్లతో సోమనపల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 

మరోవైపు రంజాన్ పురస్కరించుకొని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ A జోన్  బిలాల్ మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింసోదరులకు రంజాన్ తోఫాను అందించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.