కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ బుధవారం నిర్వహించారు. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఎంఎన్‌సీలు ఫాక్స్‌కాన్, టాటా, యూనిటెక్ కంపెనీలు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూల్లో 103 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. వీరికి ట్రినిటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ డాక్టర్ దాసరి మమతారెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
