జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతె గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతిచెందింది. ఒకే రోజు తల్లీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన దోడ్ల సంపత్(25) అప్పుల బాధతో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కొడుకు మరణ వార్తతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ(55) అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందింది.
