రూ.26 వేలకు కారు.. తండోప తండాలుగా వచ్చారు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

రూ.26 వేలకు కారు.. తండోప తండాలుగా వచ్చారు.. ఈ  చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

కారు 26 వేల రూపాయలకే వస్తే.. వినటానికి బాగున్నా.. బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలా డౌట్స్ వస్తాయి.. ఎందుకంటే.. కారు టైర్లు కొత్తవి వేయాలంటేనే 26 వేల రూపాయలు అవుతుంది.. అలాంటిది ఏకంగా కారునే 26 వేల రూపాయలకు ఇస్తాం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.. ఏమో గుర్రం ఎగరావచ్చును అన్న సామెత గుర్తుకొచ్చిందే ఏమో.. 26 వేల రూపాయలకే కారు దక్కించుకోవటానికి తండోప తండాలుగా జనం వచ్చారు.. ఇదేకెక్కడో కాదు.. హైదరాబాద్ సిటీ శివార్లలోని మల్లాపూర్ లో.. అవును.. ఇప్పుడు 26 వేల కారు రచ్చ రచ్చ అయ్యింది. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

హైదరాబాద్ సిటీ శివార్లలోని మల్లాపూర్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ఓ గ్యారేజ్ వాళ్లు ఇలా ప్రచారం చేశారు. ఇంటింటికీ కారు ఉండాలి.. అదే మా లక్ష్యం అన్నారు.. అంతేనా 26 వేల రూపాయలకే కారు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు.. ఫస్ట్ వచ్చినోళ్లకు ఫస్ట్ ప్రయార్టీ.. కొన్ని కార్లు మాత్రమే అంటూ ఇన్ స్ట్రాలో రీల్స్ దంచేశారు. ఈ మాత్రం ఆఫర్ ఉంది అంటే మన జనం ఊరుకుంటారా ఏంటీ.. ముందూ వెనకా ఆలోచన లేదు.. చెప్పిన డేట్, టైం ప్రకారం ఆ కార్ల గ్యారేజ్ దగ్గరకు తండోప తండాలుగా తరలి వచ్చారు జనం. 

తీరా వచ్చి చూస్తే కారు లేదు.. కార్ల వాళ్లూ కనిపించలేదు. 26 వేల రూపాయలతో వందల మంది 2026, జనవరి 26వ తేదీ ఉదయం 9గంటలకే వచ్చేశారు. 26 వేల రూపాయలు కట్టి కారు తీసుకెళదాం అనుకుని.. డ్రైవింగ్ రాని వాళ్లు.. డ్రైవర్ వచ్చిన ఫ్రెండ్స్ ను.. బంధువులు, చుట్టాలను వెంట తెచ్చుకున్నారు. 

తీరా గ్యారేజ్ దగ్గరకు వచ్చే సరికి.. అంతా మోసం అని తేలిపోయింది. వచ్చినోళ్లకు మండిపోయింది. మోసపోయాం అని బాగా ఫీలయ్యారు. గ్యారేజ్ లో ఉన్న కార్లను ధ్వంసం చేశారు. సమాచారం పోలీసులకు చేరింది. ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమికొట్టారు. నిర్వాహలకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అయినా అంటే అన్నారు అంటారు కానీ.. 26 వేల రూపాయలకు కారు ఎలా వస్తుంది.. సెకండ్ హ్యాండ్ కారు అయినా.. అది నడవాలంటే నాలుగు టైర్లు ఉండాలి కదా.. అలా నాలుగు టైర్లు కొత్తవి వేయాలన్నా.. చీప్ కారు ఆల్టో పాత కారుకు అయినా.. టైర్ల ఖర్చునే 26 వేల రూపాయలు అవుతుంది కదా.. వాడు అంటే వెధవ ప్రచారం చేశాడు.. మనం అయినా ఆలోచించాలి కదా.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఏంటో.. మొత్తానికి పోయాం మోసం అంటూ రీల్స్ చూసి నమ్మి వచ్చినోళ్లు అందరూ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.