నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం (మార్చి 12) జరిగిన ఈ ప్రమాద ఘటన భయాందోళనలకు గురిచేసింది. స్టేషన్ లో చెత్తను తగలబెట్టిన సమయంలో ప్రమాదవశాత్తు బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి.
చెత్తను తగలబెట్టిన సమయంలో సీజ్ చేసి ఉంచిన పాత వాహనాలు అంటుకున్నాయి. పోలీసులు సీజ్ చేసిన సుమారు 50 వరకు బైకులు, కార్లు పూర్తిగా దగ్ధమయినట్లు స్టేషన్ అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వాహనాలు చాలా కాలంగా స్టేషన్ అవరణలో పార్క్ చేసి ఉన్నాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకుని కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్టేషన్ కు చేరుకుని మంటలను ఆర్పివేశారు.
