రోజంతా వాన... ఎడతెరిపి లేని ముసురుతో జలశయాల్లోకి వరద

రోజంతా వాన... ఎడతెరిపి లేని ముసురుతో జలశయాల్లోకి వరద

నిర్మల్ అర్బన్‌‌‌‌‌‌‌‌ మండలంలో అత్యధికంగా 13.2 సెం.మీ, కడెం మండలంలో 13.1 సెం.మీ వర్షపాతం 
 
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, లింగంపేట పెద్దవాగు గాంధారి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తోంది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు 5వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డెడ్​ స్టోరేజ్​లో ఉన్న పోచారం ప్రాజెక్టులోకి బుధవారం  ఒక్కరోజే 10 అడుగుల నీరు చేరింది.బీర్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సబ్​స్టేషన్‌‌‌‌‌‌‌‌లోకి నీరు చేరింది. నిజామాబాద్ నగర శివారులోని ఆకుల కొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెక్​ డ్యాం అలుగు పారుతోంది. కాలూర్– -ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులో ఉన్న బ్రిడ్జిని తాకుతూ వరద పోతంది.  

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  వరుణుడు కరుణించడంతో ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో చెరువులు, జలాశయాలు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో ఇదే భారీ వర్షం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలకు ఈ వాన ఊపిరి పోసింది. నిర్మల్ జిల్లా అర్బన్ మండలంలో అత్యధికంగా 13.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. కడెం మండలంలో 13.1 సెం.మీ, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 12.3 సెం.మీ, నిజామాబాద్ జిల్లా మెండోరాలో 11.5 సెం.మీ, మొపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 11.2, నవీపేట 11.2, మోస్రా 10.9, డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి 10.6, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌10,  కామారెడ్డి జిల్లా జుక్కల్‌‌‌‌‌‌‌‌లో, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 10 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ముసురు పడుతూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మిడ్‌‌‌‌‌‌‌‌మానేరుకు మానేరు, మూల వాగుల నుంచి 4,556 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, గాయత్రి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లు, వరద కాలువ ద్వారా 12,600 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నీటిమట్టం 7.576టీఎంసీలు(పూర్తిస్థాయి 27.55టీఎంసీలు)గా ఉంది.  పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్‌‌‌‌‌‌‌‌లోకి వరద నీరు చేరింది. పెద్దపల్లి- భూపాలపల్లి జిల్లాల మధ్యలో ఉన్న మానేరు నదిలో వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

గోదావరిఖనిలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. రామ్​నగర్​, రాజ్యలక్ష్మికాలనీ, దుర్గానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 5 ఇంక్లైన్ చౌరస్తా, 2ఏ బొగ్గు గని, సింగరేణి 1 ఇంక్లైన్​, 2 ఇంక్లైన్​, 2ఏ ఇంక్లైన్​, ఓసీపీ 5కు వెళ్లే దారిలో రోడ్లు మునగడంతో డ్యూటీలకు వెళ్లే కార్మికులు ఇబ్బందులు పడ్డారు. డ్యూటీకి వెళుతున్న ఓ కార్మికుడి కారు గోదావరిఖని --మంథని రహదారిలో వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఇతర కార్మికులు గమనించి బయటకు తీశారు. జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవింద్‌‌‌‌‌‌‌‌ పల్లె వాగు ఉధృతంగా ప్రవహించడంతో వెంకటాద్రి నగర్‌‌‌‌‌‌‌‌కు రాకపోకలు నిలిచిపోగా, ప్రజలను జేసీబీ సాయంతో రోడ్డు దాటించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.010 టీఎంసీలకు చేరింది. స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టుల్లోకి వరద భారీగా వస్తోంది. పెంబి మండలంలోదొంతి వాగు ప్రవాహం పెరగడంతో యాపల్‌‌‌‌‌‌‌‌గూడా, రాంనగర్, సత్తుగూడ, దొందరి,  వసుపల్లి, చాకిరేవు గ్రామాలకు రాకపోలు నిలిచిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. తుంపెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తిర్యాణి మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. గుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ కె.హరిత సూచించారు.  మంచిర్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

బెల్లంపల్లి మండలం కన్నాల ఎర్రచెరువుకు గండిపడి వరద సమీపంలోని పొలాలను ముంచెత్తింది. లక్సెట్టిపేటలోని గర్ల్స్​ హైస్కూల్​లో వరద చేరి చెరువును తలపించింది. జైపూర్​ మండలం రసూల్​పల్లి వద్ద ఎన్​హెచ్​63పై భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. కోటపల్లి మండలం మల్లంపేట, నక్కలపల్లి మధ్యలోని లోతొర్రెవాగు ఉప్పొంగడంతో నక్కలపల్లి, బద్దంపల్లి, బ్రాహ్మణపల్లి, చామనపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జన్నారం మండలం బొమ్మెన వద్ద నిర్మల్​, మంచిర్యాల మెయిన్​రోడ్డుపై ్ట కుప్పకూలింది. పోలీసులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.  ప్రాణహితకు భారీగా వరద రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్​ చేశారు. కలెక్టర్​ కుమార్​ దీపక్​ కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరఘాట్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.