ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డ పరిస్థితి.. ఇక హాస్టళ్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గ్యాస్ సరఫరా లేక చాలా వరకు హాస్టళ్లలో మెస్ మూసేయగా.. కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు కొంతమంది హాస్టల్ నిర్వాహకులు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ( మార్చి 12 ) జిల్లా వ్యాప్తంగా హోటళ్ళు,రెస్టారెంట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు.
పలు హోటళ్లలో ఇరవైకి పైగా సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల చర్యలు తీసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు అధికారులు.
గృహ వినియోగదారులు కూడా గ్యాస్‌ను పొదుపుగా వినియోగించాలని.. సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచినట్లు తెలిపారు అధికారులు.
