పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ కు సిద్ధమైంది. మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూడో పాట కూడా లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ మిర్యాల పాడిన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మాస్ బీట్ సాంగ్..
పవర్ స్టార్ ఫ్యాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఎత్తరా.. ఎత్తరా.. కాలరే ఎత్తరా' మాస్ సాంగ్ ను ఫుల్ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మార్చి 19న భారీ అంచనాలతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సాంగ్ పవర్‌ఫుల్ బీట్స్‌కు పవన్ కళ్యాణ్ ఎనర్జీ తోడవడంతో ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాసర్ల శ్యామ్ ఈ పాటను రచించారు.
రన్ టైం ఎంతంటే?
ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పకుండా 'జీరో కట్స్'తో సినిమాను పాస్ చేసినట్లు సమాచారం. గతంలో 'ఓజి' (OG) చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ రావడం వల్ల వసూళ్లపై కొంత ప్రభావం పడింది, కానీ ఇప్పుడు 'ఉస్తాద్' ఫ్యామిలీ ఆడియెన్స్ అందరినీ అలరించేలా క్లీన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ మొత్తం 2 గంటల 33 నిమిషాల 59 సెకన్లు. ఇందులో పస్ట్ హాఫ్ రన్ టైం గంట 11 నిమిషాల 30 సెకన్లు. సెకాండాఫ్ రన్ టైం గంట 22 నిమిషాల 29 సెకన్లు.
భారీ తారాగణం..
పవర్ స్టార్ , హరీష్ శంకర్ లాంటి పవర్ ఫుల్ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు, మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.. అలాగే ఆర్. పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎం, దశరథ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. 'గబ్బర్ సింగ్' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, ఈ మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి!
