సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఆడేది సొంతగడ్డపై అయినా.. విదేశీ గడ్డపై అయినా భారత టీ20 జట్టును ఓడించాలంటే ప్రపంచంలోని ఏ జట్టుకైనా శక్తికి మించిన పని.
రెండేళ్లుగా ఇండియా టీ20 ఫార్మాట్ లో తిరుగు లేని జట్టుగా నిలిచింది. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో జట్టు ఓ రేంజ్ లో ఆడుతుంది. కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి బ్యాటర్ గా విఫలమైన సూర్య నాయకత్వంతో జట్టుకు విజయాలను అందిస్తూనే ఉన్నాడు.
సూర్య కెప్టెన్సీలో ఇండియా ఆసియా కప్ గెలుచుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో జయభేరి మోగించింది. 2025 ఏడాది చివర్లో సౌతాఫ్రికాపై ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-1 తేడాతో నెగ్గింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం (జనవరి 25) కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సూర్య ఖాతాలో ఒక వరల్డ్ రికార్డ్ వచ్చి చేరింది.
►ALSO READ | T20 World Cup 2026: శాంసన్‌కు చెక్.. వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఆ ఇద్దరూ ఫిక్స్
అంతర్జాతీయ టీ20 కెప్టెన్ గా తొలి 40 మ్యాచ్ ల్లో అత్యధిక మ్యాచ్ లు గెలిపించిన కెప్టెన్ గా సూర్య రికార్డ్ సృష్టించాడు. ఇండియా టీ20 కెప్టెన్ గా సూర్య 40 మ్యాచ్ ల్లో 32 విజయాలను అందించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (31), ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గహార్ ఆఫ్ఘన్ (31) లను వెనక్కి నెట్టాడు. వరల్డ్ కప్ ముందు ఇండియాకు విజయాలను అందించడమే కాదు టాప్ ఇన్నింగ్స్ ఆడుతూ సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవలే కివీస్ తో ముగిసిన మూడు టీ20 మ్యాచ్ ల్లో సూర్య బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. మరి కెప్టెన్ గా సూర్య మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి.
