ఇరాన్ - ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారతదేశానికి చెందిన రెండవ పెద్ద LPG గ్యాస్ నౌక 'నందా దేవి' క్షేమంగా హార్ముజ్ జలసంధిని దాటింది. దింతో మరో రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకోనుంది. 'నందా దేవి' నౌక గల్ఫ్ ప్రాంతాన్ని దాటి ప్రస్తుతం సముద్రంలోకి ప్రవేశించింది. దీనికి మన భారత నావికాదళం రక్షణగా నిలుస్తూ ప్రయాణిస్తుంది.
అయితే ఈ నౌక మరో రెండు రోజుల్లో ముంబై లేదా కాండ్లా ఓడరేవుకు చేరుకునే అవకాశం ఉంది. దీనికంటే ముందే 'శివాలిక్' అనే మరో గ్యాస్ నౌక కూడా సురక్షితంగా బయటపడి భారత్ వైపు వస్తోంది. నందా దేవి నౌకలో సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల వంట గ్యాస్ (LPG) ఉండగా... ప్రస్తుతం మన దేశ ఇంధన అవసరాలకు ఇది ఎంతో కీలకం.
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత ప్రభుత్వం జరిపిన దౌత్య చర్చల ఫలితం వల్ల మన దేశ నౌకలకు లైన్ క్లియర్ అయ్యింది. గల్ఫ్ దేశాల నుండి LPG దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశానికి ఈ చర్చలు చాలా ముఖ్యమైనది. మన భారత నావికాదళం ఈ నౌకలను గమనిస్తూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా రక్షణ కల్పిస్తోంది. అలాగే మిగిలిన భారతీయ నౌకలు కూడా ఇదే తరహాలో సురక్షితంగా వచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
