Abrar Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన టీమ్ పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది. 2026లో జరగనున్న ది హండ్రెడ్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్‌ను £190,000 (సుమారు రూ.2.3 కోట్లు)కు కొనుగోలు చేసింది. దీంతో అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ విషయంపై ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య తీవ్రంగా మండిపడ్డారు. ఇండోర్‌లో నిర్వహించిన “సనాతన్ ప్రీమియర్ లీగ్” కార్యక్రమంలో మాట్లాడుతూ.. మన డబ్బు మన దేశంలోనే ఉండాలి.. భారతదేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారాలి.. పాకిస్తాన్ క్రికెటర్లకు డబ్బు ఇవ్వడం కంటే ఇండియన్ ప్లేయర్స్ ని ప్రోత్సహించాలని సూచించారు. అదే డబ్బుతో వారు మనపై మిసైళ్లు ప్రయోగించవచ్చు.. మనపై దాడులు చేసే దేశంపై ఎందుకు ఇంత ప్రేమ చూపించాలి? అని అనిరుద్ధాచార్య ప్రశ్నించాడు.
గ్రామాల నుంచి వచ్చిన యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం చాలా అవసరం ఉందని ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య చెప్పారు. ఇలాంటి లీగ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మంచి వేదిక లభిస్తుంది.. వారు భవిష్యత్తులో దేశానికి సేవ చేయగలుగుతారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ (X) ఖాతా కూడా సస్పెండ్ కావడం మరో చర్చకు దారి తీసింది. అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్న కొద్ది గంటలకే ఆ ఖాతా సస్పెండ్ అయింది. దీనిపై సోషల్ మీడియా వేదిక X ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఖాతాను తెరవడానికి ప్రయత్నిస్తే “ఈ అకౌంట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నిలిపివేయబడింది” అనే మెసేజ్ కనిపిస్తుంది.
ఇక IPLలో 2009 తర్వాత ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆటగాళ్లు పాల్గొనలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంచైజీలు సాధారణంగా పాక్ ప్లేయర్స్ ని తీసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. దీంతో సన్‌రైజర్స్ లీడ్స్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు భారత్ లో తీవ్ర చర్చకు కారణమైంది.
Indore, Madhya Pradesh: On Kavya Maran's Sunrisers Leeds picking Pakistani spinner Abrar Ahmed in The Hundred league, Katha Vachak Aniruddhacharya says, "Indian cricketers should be bought. India's money should remain in India. Now with that same money, Pakistan will fire… pic.twitter.com/U5ibpIcqh4
— IANS (@ians_india) March 13, 2026
