కేకేఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి జింబాబ్వే బౌలర్ ముజరబానీ

కేకేఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి జింబాబ్వే బౌలర్ ముజరబానీ

కోల్‌‌‌‌కతా: టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో తన పేస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో అదరగొట్టిన జింబాబ్వే స్పీడ్ గన్‌‌‌‌ బ్లెస్సింగ్ ముజరబానీకి ఐపీఎల్‌‌‌‌ చాన్స్ వచ్చింది. ముజరబానీని తమ జట్టులోకి తీసుకున్నట్టు కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) శుక్రవారం ప్రకటించింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానాన్ని అతనితో భర్తీ చేసినట్టు తెలుస్తోంది. ఇండియా-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌‌ను కేకేఆర్ జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

కాగా, 6.8  అడుగుల ఎత్తుండే ముజరబానీ  టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు (6 మ్యాచ్‌‌‌‌ల్లో 13 వికెట్లు) తీసిన బౌలర్‌‌‌‌గా నిలిచాడు. గతేడాది ఆర్సీబీ జట్టులో ఉన్నప్పటికీ తనకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుతం కేకేఆర్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందుకోసం పాకిస్తాన్ సూపర్ లీగ్‌‌ నుంచి  వైదొలిగిన ముజరబానీ ఈ నెల17న కోల్‌‌‌‌కతా చేరుకోనున్నాడు. ఈ కొత్త పేసర్ రాకతో కేకేఆర్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.