శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందజేస్తోంది టీజీఎస్ ఆర్టీసీ . మార్చి 27న భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణ వేడుకకు వెళ్లలేని రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం తలంబ్రాలు అందజేసే విషయంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి బుకింగ్ ప్రారంభమైనట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది.
►ALSO READ | Ugadi 2026 : కొత్త సంవత్సరం పేరేంటి.. ఏరాశిలో ప్రారంభమవుతుంది..!
గతేడాదిలాగే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టారు. తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www.tgsrtclogistics.co.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే, టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాములోరి కల్యాణం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేస్తారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040 -23450033, 040 -69440069లలో సంప్రదించవచ్చు.
🙏 శ్రీ రామనవమి (27.03.2026) సందర్భంగా, భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దనే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను TGSRTC ప్రారంభించింది. pic.twitter.com/AD867zhq0t
— TGSRTC (@TGSRTCHQ) March 14, 2026
