T20 World Cup 2026: శాంసన్‌కు చెక్.. వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఆ ఇద్దరూ ఫిక్స్

T20 World Cup 2026: శాంసన్‌కు చెక్.. వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఆ ఇద్దరూ ఫిక్స్

2026 వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ నెలకొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ ఇండియాలోనే జరుగుతుండడంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టైటిల్ నిలబెట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరుగుండగానే మరోవైపు వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరనే విషయంలో చర్చ సాగుతోంది. వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

న్యూజిలాండ్ తో సిరీస్ ముందువరకు వరల్డ్ కప్ కు ఓపెనర్లు కన్ఫర్మ్ అయ్యారు. అభిషేక్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ దిగడం ఖాయమనుకున్నారు. అయితే ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ చూస్తే శాంసన్ వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. శాంసన్ పేలవ ఫామ్ ఇందుకు కారణం. న్యూజిలాండ్ తో ఇప్పటివరకు జరిగిన మూడు టీ 20 మ్యాటిక్ ల సిరీస్ లో శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్ ల్లో కలిపి 16 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. 

ALSO READ : 3D ప్లేయర్ అంటే ఇలా ఉండాలి: వెనక్కి డైవ్ చేస్తూ పాండ్య సూపర్ మ్యాన్ క్యాచ్.. వీడియో వైరల్

మరోవైపు ఇషాన్ కిషాన్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. కిషాన్ దూకుడు చూస్తుంటే వరల్డ్ కప్ ప్లేయింగ్ 11లో స్థానం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ జట్టులోకి వస్తే కిషన్ లేదా శాంసన్ లలో ఒకరు తప్పుకోవాలి. దీని ప్రకారం ఫామ్ లో ఉన్న కిషాన్ ను అభిషేక్ శర్మతో ఓపెనింగ్ కు పంపొచ్చు.