బోరబండలో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య, కుమారుడు మృతి

బోరబండలో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య, కుమారుడు మృతి

హైదరాబాద్​ నగరంలోని  బోరబండ పోలీస్​ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  కుటుంబ కలహాలతో  ఓ మహిళ  తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పిల్లల్లో కుమారుడు చనిపోయాడు. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. హృదయ విదారక ఘటనతో  బోరబండలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్​లోని బోరబండ పీఎస్​ పరిధిలోని పెద్దమ్మ నగర్​ లో శనివారం(మార్చి14)  ఈ దారుణం జరిగింది. పెద్దమ్మనగర్​ కు చెందిన సత్యవాణి అనే మహిళ  ఆమె ఇద్దరు పిల్లలు  ఐదేళ్ల రుద్రాన్ష్​, రెండేళ్ల కుమార్తె తన్విక గొంతు నులిమి తాను ఫ్యాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో కుమారుడు రుద్రాన్స్​ అక్కడికక్కడే చనిపోగా, కుమార్తె తన్విక ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  గత కొంత కాలంగా జరుగుతున్న కుటుంబ కలహాలతో  విసుగెత్తిపోయి  సత్యవాణి ఈ దారుణానికి   పాల్పడినట్లు తెలుస్తోంది. 

సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.