రాంబాయి సినిమా తరహాలో ఘటన.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు

రాంబాయి సినిమా తరహాలో ఘటన.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు

సూపర్​ హిట్​ కొట్టిన రాజు వెడ్స్​రాంబాయి సినిమాలో తరహాలో మేడ్చల్​ జిల్లాలో ఓ ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి HIV పాజిటివ్​ రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు ఓ యువకుడు.  సినిమాలో హిరోయిన్​ తండ్రి ఆమెకు HIV పాజిటివ్ రక్తం ఎక్కించినట్లుగానే అదే తరహాలో యువకుడు చేయడం సంచలనంగా మారింది. వరాల్లోకి వెళ్లితే..

మేడ్చల్​జిల్లా   పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ లో దారుణం జరిగింది.  అన్నోజిగూడకు చెందిన మనోహర్ కు అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఎంగేజ్​ మెంట్ కూడా అయిపోయింది.  అయితే పెళ్లికొడుకు మనోహర్​, అతని తల్లిదండ్రులకు HIV పాజిటివ్​ అని తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో మనోహర్​యువతిపై కక్ష పెంచుకున్నాడు. 

ఈక్రమంలో  యువతి ఇంటికి వెళ్లిన మనోహార్​ పెళ్లి చేసుకోవాలని  మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో  తన వెంట తెచ్చుకున్న  HIVపాజిటివ్​ రక్తం ఇంజెక్షన్​ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. యువతికి జ్వరం రావడంతో తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో  దారుణం వెలుగులోకి వచ్చింది.  

యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.