IND vs NZ: 3D ప్లేయర్ అంటే ఇలా ఉండాలి: వెనక్కి డైవ్ చేస్తూ పాండ్య సూపర్ మ్యాన్ క్యాచ్.. వీడియో వైరల్

IND vs NZ: 3D ప్లేయర్ అంటే ఇలా ఉండాలి: వెనక్కి డైవ్ చేస్తూ పాండ్య సూపర్ మ్యాన్ క్యాచ్.. వీడియో వైరల్

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆశ్యర్యపరిచాడు. ఆదివారం (జనవరి 25)  గౌహతి వేదికగా  బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒక స్టన్నింగ్ క్యాచ్ లో మైండ్ పోగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే ఈ సీన్ చోటు చేసుకుంది. హర్షిత్ రానా వేసిన బంతిని కాన్వే మిడాఫ్ దిశగా ఆడాడు. టైమింగ్ మిస్ కావడంతో బంతి అక్కడే గాల్లో లేచింది. మిడాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న పాండ్య వెనక వైపు నుంచి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. 

హార్దిక్ పాండ్య పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ లో అద్భుతమైన క్యాచ్ అందుకున్న పాండ్య రెండో ఓవర్లో ఒక వికెట్ తీసుకున్నాడు. క్రికెట్ లో 3D ప్లేయర్ అంటే ఎలా ఉండాలో పాండ్య చూపించాడు. బ్యాటింగ్ లో అవకాశం వచ్చినప్పుడు దుమ్ములేపే పాండ్య బౌలింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఈ రెండింటితో పాటు తన ఫీల్డింగ్ విన్యాసాలతో అబ్బురపరుస్తున్నాడు.    

ఈ మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం చూపించింది. ప్రత్యర్థి కివీస్ ను పసికూనగా మార్చేసి చిత్తుచిత్తుగా ఓడించారు. 154 పరుగుల టార్గెట్ ను కేవలం 10 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 60: 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లోనే 57: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వ రూపం చూపించి కివీస్ కు ఘోరమైన పరాభవాన్ని మిగిల్చారు. 

ALSO READ :  హర్షిత్ రానా పాంచ్ పటాకా.. కివీస్ స్టార్ ప్లేయర్‌కు పీడకలగా టీమిండియా పేసర్

ఆదివారం (జనవరి 25)  గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బౌలింగ్ లో బుమ్రా, బిష్ణోయ్ చెలరేగేడంతో పాటు బ్యాటింగ్ లో అభిషేక్ చుక్కలు చూపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇండియా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.