Pakistan Players: టీమిండియా ఫ్రాంచైజీలకు ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే!

Pakistan Players: టీమిండియా ఫ్రాంచైజీలకు ఆడుతున్న పాకిస్తాన్ ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే!

Pakistan Players: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పర్యటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడులతో పలువురు చనిపోయారు. దీంతో ఇండియన్  ఆర్మీ పాకిస్తాన్ పై 'ఆపరేషన్ సిందూర్ తో ఉక్కుపాదం మోపింది. దాయాది దేశంలో ఉన్న ఉగ్రస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో భారత్– పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ వార్ తర్వాత జరిగిన ఆసియా కప్-2025లో టీమిండియా క్రికెట్ జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాక్ క్రికెట్ బోర్డు నానా రాద్ధాంతం చేయగా రంగంలోకి దిగిన ఐసీసీ తీవ్రంగా మండిపడింది. 

టీ20 వరల్డ్ కప్-2026 టోర్నమెంట్ కి భారత్– శ్రీలంక ఆతిథ్యం ఇవ్వగా.. పాక్ కోసం లంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయినా సరే బంగ్లాదేశ్ ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. పరువుపొగొట్టుకుంది. ఇలాంటి పరిణామాలతో ఇంగ్లాండ్ లో జరిగిన 'ది హండ్రెడ్ లీగ్-2026' వేలంలో సన్ గ్రూపుకు చెందిన కావ్య మారన్ ఆధ్వర్యంలోని సన్ రైజర్స్ లీడ్స్ పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ని కొనుగోలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

భారత్ తో మ్యాచ్ లో అతి చేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ ని కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్ కోసం సన్ రైజర్స్ యాజమాన్యం రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. ఇండియన్స్ కావ్య పాపపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం 'ది హండ్రెడ్ (ఇంగ్లండ్)' విదేశీ లీగ్ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. దీంతో ఓ ఆసక్తికర విషయం తెర మీదపైకి వచ్చింది.  సన్ రైజర్స్ తాజాగా పాక్ ఆటగాడిని తీసుకోగా.. ఇంతకు ముందే పలు ఇండియన్ టీ20 ఫ్రాంఛైజీలు పాకిస్తాన్ ప్లేయర్లకు తమ టీమ్స్ లోకి తీసుకున్నాయి. 

ఇండియన్ ఫ్రాంఛైజీలకి ఆడుతున్న పాక్ ప్లేయర్స్ వీళ్లే: 
* పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తన బౌలింగ్ యాక్షన్ వార్తల్లోకి నిలిచిన స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్ కతా నైట్ రైడర్స్ యజమానులైన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లుగా కొనసాగుతున్నారు.

* అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MCL)లో గతేడాది పాక్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం సీటెల్ ఓర్కాస్ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. ఈ టీమ్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంతో భాగమైన GMR గ్రూప్ కు చెందింది. కాగా ఇమాద్ వసీం 2023-–24 ILT20 సీజన్లో కేకేఆర్ కి చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి సైతం ఆడాడు. 

* ఇక పాకిస్తాన్ కి చెందిన మరో క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్ కి చెందిన ఎంఐ ఎమిరేట్స్ తరపున ఆడాడు. 

* ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్ ని సన్‌రైజర్స్ కొనగా.. మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ ని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్ ఆయుబ్, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ లాంటివంటి స్టార్ ఆటగాళ్లు అన్‌సోల్డ్ గా మిగిలిపోయారు. 

* పాకిస్తాన్ ఆటగాడిని సన్‌రైజర్స్ లీడ్స్ యాజమాన్యం తీసుకుంటే తప్పు అయినప్పుడు.. మరీ మిగత ఫ్రాంచైజీలు కొనుగోలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియాలో మరో వర్గం ప్రశ్నిస్తుంది. అయినా బీసీసీఐకి లేని అభ్యంతరం మీకెందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు.