గాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే.. రూ.5000 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్

గాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే.. రూ.5000 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్

గాంధీ సరోవర్కు రూ.200 కోట్లు కేటాయిస్తే రూ.5000 కోట్లు అని ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం (మార్చి 13) హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో మూసీ పునరుజ్జీవం పై ప్రభుత్వ ప్రెజెంటేషన్ సదర్భంగా మాట్లాడిన సీఎం.. మూసీ బ్యూటిఫికేషన్ ను లూటిఫికేషన్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. గాంధీని చంపిన వాళ్లు కూడా ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండి పడ్డారు. గాంధీ అస్తికలు కన్యాకుమారిలో కలపడం ద్వారా ఫేమస్ అయ్యిందని.. బాపూ ఘాట్ కూడా అలాంటిదేన్నారు సీఎం. 

సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:

  • అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును తీసుకున్నాం
  • నిపుణులు మేధావులతో చర్చించాకే నిర్ణయం
  • నల్గొండ గురించి ఒక్కరైనా ఆలోచన చేస్తున్నారా?
  • మేం తెచ్చే ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు
  • ఈ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు అక్కడ నివసించండి
  • వద్దనే వారందరికీ కంటైనర్ ఇళ్లు ఇస్తాం
  • మేం తెచ్చే ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు
  • ఈ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు అక్కడ నివసించండి
  • వద్దనే వారందరికీ కంటైనర్ ఇళ్లు ఇస్తాం
  • దుబాయ్, సింగపూర్, సబర్మతి లాంటి ప్రాంతాలను చూశాను
  • వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు చేశాం
  • మూసీ మురికి ఉండాలని ఎవరూ కోరుకోరు
  • ఏ వసతి లేక అక్కడ ఉంటున్నారు
  • బుల్డోజర్ లతో కూల్చేస్తున్నారని అంటున్నారు
  • చదువుకున్న వాళ్లు మాట్లాడే మాటలేనా.?
  • చట్టం అమల్లోకి వచ్చినప్పుడు బాగుంది అన్నవాళ్లు దాని అమలు చేస్తామంటే అడ్డుకుంటన్నారు
  • 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు, పదేళ్లు పాలించిన వాళ్లు సలహాలు ఎందుకు ఇవ్వడం లేదు..?
  • 1908 లో ఉప్పెన వచ్చి నగరాన్ని కప్పేసింది
  • అప్పుడు నిజాం రాజులు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించారు
  • ఆయన సూచనల మేరకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించారు
  • వరదలను నియంత్రించడమే కాదు, మంచినీళ్లు కూడా అందిస్తున్నాయి
  • మన చరిత్ర మనమే కాల గర్భంలో కలిపేద్దామా?
  • మీరు గొప్ప చదువులు చదువుకోవచ్చు
  • కానీ నేను ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న
  • అన్ని చూస్తున్నా, నేర్చుకుంటున్నా
  • మీరంతా వద్దు అంటే చెప్పండి ఆపేస్తా
  • మీకు అవసరం లేని అభివృద్ధి నాకెందుకు
  • నేను మంచికి ప్రతినిధి కావాలని అనుకుంటున్నా
  • తెలంగాణకు రెండో సీఎం అయ్యే అవకాశం ఇచ్చారు
  • రెండు మంచి పనులు చేయాలని చూస్తున్నా
  • మూసీ పరివాహక ప్రాంతంలో 10 వేల కుటుంబాలున్నాయి
  • ఒక్కో కుటుంబానికి ఎంత ఇద్దామో చెప్పండి
  • నేను హిందువుని, కర్మ సిద్ధాంతం నమ్ముతా
  • వేరే మతాలను కూడా గౌరవిస్తా
  • శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు యజ్ఞాలను భగ్నం చేసేవాళ్లు
  • అయినా దేవతలు యజ్ఞాలు మానలేదు
  • మా ఇంట్లో 1300 ఫీట్లు వేస్తే నీళ్లు వచ్చాయి
  • కాంక్రీట్ జంగిల్ తో గ్రౌండ్ వాటర్ పడిపోయింది
  • 75 ఏళ్ల చరిత్రలో మనం కట్టిన అద్భుత కట్టడం ఏదైనా ఉందా?
  • సహకరించే మనసు లేకపోయినా ఓకే, కానీ అడ్డుకోవద్దు